Niharika: టాలీవుడ్ యంగ్ హీరోతో ఐదేళ్ల రిలేషన్‌షిప్.. లవ్ సింబల్ జోడించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్.. హాట్ టాపిక్‌గా మారిన మెగా డాటర్ పోస్ట్

by Mallepaka Hamsa |

మెగా డాటర్ నిహారిక(niharika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు, హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది.

Niharika: టాలీవుడ్ యంగ్ హీరోతో ఐదేళ్ల రిలేషన్‌షిప్.. లవ్ సింబల్ జోడించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్.. హాట్ టాపిక్‌గా మారిన మెగా డాటర్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(niharika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి పని లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు, హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. కానీ యాంకర్‌గా బుల్లితెరపై మెగా డాటర్ బాగానే మార్కులు కొట్టేసింది. ఇక అంతా బాగానే ఉందనుకునే క్రమంలోనే పెళ్లి చేసుకోవడం నిహారిక తన భర్తతో విడిపోవడం అంతా జరిగిపోయింది. డైవర్స్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘కమిటి కుర్రోళ్లు’ (Committee Kurrollu)చిత్రంతో నిర్మాతగా మారిన నిహారిక రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీలో ఏకంగా 11 మందిని కొత్త నటీనటులను పెట్టి తీసినప్పటికీ బాక్సాఫీసును షేక్ చేయడంతో పాటు భారీ కలెక్షన్లను రాబట్టింది.

అంతేకాకుండా ఇటీవల గద్దర్ అవార్డును కూడా దక్కించుకోవడంతో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగా డాటర్ పేరు మార్మోగిపోతోంది. ఇక నిహారికకు ఈ ప్రాజెక్ట్ రావడానికి ఓ కుర్ర హీరో కారణం అన్న సంగతి తెలిసిందే. కుర్ర హీరో అంకిత్ కొయ్య ఈ మూవీ డైరెక్టర్ యదు వంశీ(Yadu Vamsi) మంచి స్నేహితులు. స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్న క్రమంలోనే నిహారిక దగ్గరకు వెళ్లగా దానికి ఆమె ఒకే చెప్పింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌(Pink Elephant Pictures)పై నిర్మించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఓ యంగ్ హీరోతో తన రిలేషన్‌షిప్ గురించి చెప్తూ అతనికి పుట్టినరోజు విషెస్ తెలిపింది.

అతనెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో అంకిత్ కొయ్య బర్త్ డే కావడంతో నిహారిక ‘‘ అబ్బాయి నాకు ఐదేళ్లుగా తెలుసు.. కలిసినప్పుడు గంటల కొద్దీ ఎప్పుడూ మాట్లాడుకునే సినిమా టాపిక్ నాకు చాలా ఇష్టం.. అది నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సపోర్టివ్ పిల్లర్‌గా నిలిచారు.. ప్యాషనేట్ స్టోరీ టెల్లర్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ సరైన ఫ్లాట్ ఫాంలు కల్పిస్తుంటారు.. ఇలానే స్వచ్చమైన మనసుతో ముందుకు వెళ్తుండాలి.. హ్యాపీ బర్త్ డే అంకిత్.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఛాన్స్ కావాలన్నా, రీచ్ కావాలన్నా.. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.

Next Story