- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీలో ఐదుగురు హీరోయిన్స్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విశ్వంభర’(Vishvambhara).

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విశ్వంభర’(Vishvambhara). గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వశిష్ట తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. అషికా రంగనాథ్(Ashika Ranganath) కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో మౌనీరాయ్ స్పెషల్ సాంగ్ చేయనుంది. సోషియో-ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతుండగా.. దీనిని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఇందులో చివరిగా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల ఓ ఫొటోను కూడా షేర్ చేసి మెగా ఫ్యా్న్స్‌లో జోష్ నింపారు.
అయితే ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని గత కొద్ది కాలంగా పలు వార్తలు వైరల్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ట ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘‘మా సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు నమ్మకండి. ‘విశ్వంభర’ మూవీలో త్రిష మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా చేస్తుంది. ఇకఅషికా రంగనాథ్ మాత్రం సెకండ్ లీడ్‌గా నటించనుంది. వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. విడిగా నటీమణులు కొన్ని ముఖ్య పాత్రలో కనిపిస్తారు. స్క్రీన్‌పై వీళ్లందరూ చాలా ఫ్రెష్‌గా ఉంటారు.
వీఎప్‌ఎక్స్ వర్క్ కారణంగానే విడుదల ఆలస్యమవుతుంది. మా సినిమా అనిల్ రావిపూడి-చిరు కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ చాలా విభిన్నమైనవి. అందుకే నాకు ఎలాంటి టెన్షన్ లేదు’’ అని చెప్పుకొచ్చారు. అలాగే ‘అవతార్’ కాపీ అంటూ వచ్చిన వార్తలపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. మనం ఎప్పుడూ విజువల్ రిఫరెన్స్ హాలీవుడ్ నుంచి తీసుకుంటున్నాం అని అంటుంటాం తప్ప. వాళ్లు మన దగ్గర నుండి తీసుకున్న మ్యాటర్ ఎవరూ చెప్పట్లేదు. ‘అవతార్’ 2009లో వచ్చింది. కానీ సేమ్ విజువల్స్ 1998లో ‘జ్వాల దీపం’ అనే బుక్‌లో ఉంటాయి” అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






