ఫస్ట్ టైమ్ కూతురి ఫేస్ రివీల్ చేసిన పవన్ కల్యాణ్ హీరోయిన్.. క్యూట్ పిక్స్ వైరల్..!

by Disha Web Desk 9 |
ఫస్ట్ టైమ్ కూతురి ఫేస్ రివీల్ చేసిన పవన్ కల్యాణ్ హీరోయిన్.. క్యూట్ పిక్స్ వైరల్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బావ’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ప్రణీత సుభాష్. ఈ ముద్దుగుమ్మ అత్తారింటికి దారేది, రభస, హాలో గురు ప్రేమకోసమే’ లాంటి చిత్రాల్లో నటించి.. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ఓ వ్యాపారవేత్తను పెళ్లాడి.. పూర్తిగా సినిమాలకు దూరమైంది. అయితే ప్రణీత ఎన్నో సార్లు తన పాపతో కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కానీ తన ముఖం మాత్రం కనిపించకుండా కవర్ చేసేది. నేడు (సెప్టెంబరు 24) డాటర్స్ డే సందర్భంగా తన చిన్నారి క్యూట్ కుమార్తెతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ బ్యూటీ తన పాపను ముద్దులతో ముంచేస్తూ.. మురిసిపోతున్న పిక్స్‌ను నెట్టింట షేర్ చేయగా.. ‘ఒక పాపకు జన్మనిచ్చిన ఇప్పటికీ సంతూర్ యాడ్‌లో మమ్మీలాగే ఉన్నావు, పాప కూడా నీలాగే చాలా అందంగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.



Next Story

Most Viewed