Agent Movie Review : యూఎస్‌లో ‘ఏజెంట్’ ప్రీమియర్స్ ఫస్ట్ రివ్వూ..

by Disha Web Desk 7 |
Agent Movie Review : యూఎస్‌లో ‘ఏజెంట్’ ప్రీమియర్స్ ఫస్ట్ రివ్వూ..
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు అమెరికాలో నడుస్తున్నాయి. దీంతో అఖిల్ ఈ మూవీ ద్వారా విజయాన్ని అందుకున్నాడో లేదో అనేది యుఎస్ ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా రివ్యూ ఇస్తున్నారు. ‘ఈ మధ్య కాలంలో ఇంత కిక్ ఇచ్చే, స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చూడలేదు’ అని చెబుతున్నారు.

అలాగే ‘ఈ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. అతని కెరీర్‌లో మంచి హిట్ పడ్డట్టే’ అని టాక్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అని అంటున్నారు. ‘సమ్మర్‌లో మూవీ లవర్స్‌కు ‘ఏజెంట్’ ఒక పండుగలా ఉంటుంది’ అని పేర్కొంటున్నారు. మొత్తానికి ఈసారి హిట్ కొట్టాలని అఖిల్ గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నాడు.

Also Read..

ఏజెంట్ మూవీ.. అఖిల్ ఖాతాలో హిట్ట్ పడనట్లేనా?

Next Story

Most Viewed