ఫస్ట్ సినిమాకే.. బ్యాగ్ సర్ది అమెరికాకు జంప్.. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. అతను ఎవరంటే?

by Disha Web Desk 10 |
ఫస్ట్ సినిమాకే.. బ్యాగ్ సర్ది అమెరికాకు జంప్.. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. అతను ఎవరంటే?
X

దిశ, సినిమా: ఒక సక్సెస్‌ఫుల్ వ్యక్తి వెనుక ఎవరికీ తెలియని కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అలాంటి వారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. ఒక్కోసారి ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఎదుర్కొన్నప్పుడు జీవితంలో ఇంక ఆ పనులు చేయడం మానుకుని, కొత్త పనులు ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రం వారిలో పరోక్షంగా స్ఫూర్తిని నింపి విఫలమైన వ్యక్తులను సక్సెస్ అయ్యేలా చేయగలరు. అలాంటి వ్యక్తులలో ఫహద్‌ ఫాజిల్‌ కూడా ఒకరు. ఒక ఫ్లాప్ డెబ్యూ నుంచి అతడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప సినిమాతో ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడు సినీ జర్నీ చాలా ఆసక్తికరంగా సాగింది.

అద్భుతమైన నటన వల్ల అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ అవార్డు అతని చెంతకు వచ్చి చేరింది. పాన్-ఇండియా సక్సెస్ కూడా వరించింది. ఇంత స్టార్‌డమ్‌కి ముందు అతని ప్రయాణం ముళ్లబాట. ఫహద్‌ ఫాజిల్‌ నటించిన మొదటి సినిమా అట్లర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా వల్ల బ్యాగ్ సర్ది అమెరికాకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా సవాళ్లను అధిగమించాల్సి వచ్చింది. యాక్టింగ్‌పై ఎంతో మక్కువ ఉన్నా మొదటి సినిమాతోనే విఫలం కావడంతో నిరాశ చెందాడు. ఇప్పుడు ఫహద్‌ ఎందరికో ఇన్‌స్పిరేషన్‌ అయ్యాడు. త్వరలో పుష్ప 2 లో మనల్ని పలకరించబోతున్నాడు.

Next Story

Most Viewed