‘గామి’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. కళ్లజోడుతో ఆకట్టుకున్న జాహ్నవి

by Disha Web Desk 7 |
‘గామి’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. కళ్లజోడుతో ఆకట్టుకున్న జాహ్నవి
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ అడ్వెంచర్ చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈమూవీ నుంచి ఇప్పటికే రిలీజైన అన్ని అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. ఇటీవల విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించింది. టీజర్‌లో ఎక్కువ డైలాగులు లేనప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం గూస్ బంమ్స్ తెప్పించాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వేరీ టాలెంటెడ్ హీరోయిన్ చాందిన చౌదరి నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తూ.. పాత్ర పేరు ‘జాహ్నవి’గా పరిచయం చేశారు. ఇందులో చాందిని కళ్లజోడుతో పెక్యులర్‌గా ఉన్న పోస్టర్ మరింత క్యూట్‌గా ఆకట్టుకుంటోంది. ఆమె వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో జాహ్నవి (చాందిని) దేని గురించో, ఎవరి గురించో వెతుకుతున్నట్లుగా అర్థం అవుతోంది. కాగా.. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఫిబ్రవరి 29న విడుదల కానుంది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా పాత్రలో విశక్ సేన్ కనిపించనున్నాడు.






Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed