ఎట్టకేలకు ‘ఖుషీ’ అప్‌డేట్.. అదిరిపోయిన ఫస్ట్ సాంగ్ ప్రోమో

by Disha Web Desk 10 |
ఎట్టకేలకు ‘ఖుషీ’ అప్‌డేట్.. అదిరిపోయిన ఫస్ట్ సాంగ్ ప్రోమో
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషీ’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ అప్‌డేట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు చిత్ర యూనిట్ మంచి అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘నా రోజా నువ్వే’ ప్రోమో రిలీజ్ చేయగా.. మే 9వ ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక సాంగ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ కాబోతుండగా.. మాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం అద్భుతంగా ఉన్నట్లు అనిపిస్తోంది. కేవలం ప్రోమోలోనే మెలోడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తారని అంటున్నారు నెటిజన్స్

Next Story

Most Viewed