- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఫైనల్లీ క్రేజీ కాంబో ఫిక్స్.. ఆ స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు మూవీ(ట్వీట్)

దిశ, వెబ్‌డెస్క్: వెంకటేష్ – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) ‘మల్లీశ్వరి’ (Malleswari) సినిమాలు ఎంతగా విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. దీంతో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వెంకటేష్ హీరోగా ఒక సినిమా రావాలని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాలి. కానీ మధ్యలో బన్నీ.. అట్లీ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాడు. కాబట్టి త్రివిక్రమ్‌కి కొంత టైం దొరికింది. ఈ గ్యాప్లో అతను ఓ మిడ్ స్కేల్ ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తీయడం త్రివిక్రమ్‌కి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. కానీ వాటిని ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు అనే కంప్లైంట్ కూడా ఉంది. అయితే ఈ షార్ట్ గ్యాప్లో అలాంటి ప్రాజెక్టు మాత్రమే త్రివిక్రమ్ చేయగలరు. అందుకే వెంకటేష్‌తో మూవీ చేయాలని అనుకుంటున్నాడట.
ఈ క్రమంలో దాదాపు 20 సంవత్సరాల ప్రణాళిక తర్వాత.. వెంకటేష్, త్రివిక్రమ్ ఫైనల్‌గా ఒక ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీలో పనిచేస్తున్నారు. అయితే వెంకటేష్‌కు త్రివిక్రమ్ ఈ కథ గురించి వినిపించగానే వెంకీ మామకు ఫుల్‌గా నచ్చేసి వెంటనే ఓకే చెప్పాశాడట. అంతేకాకుండా ఈ మూవీలో అతని పాత్రను అతని కోసమే ప్రత్యేకంగా రూపొందించారని తెలుస్తోంది. ఇక చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబో త్వరలో బిగ్ స్క్రీన్ మీదకు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.