Ram Pothineni: రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను మూవీ చిత్రీకరణ ఆగిపోయిందా?

by Disha Web Desk 10 |
Ram Pothineni: రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను మూవీ చిత్రీకరణ ఆగిపోయిందా?
X

దిశ, సినిమా: టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో రామ్ పోతినేని. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తనదైన స్టైల్లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. కాగా మంచి హిట్ కొట్టాలని చూస్తున్న రామ్, ప్రజెంట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ సదరు మూవీ చిత్రీకరణ ఆగిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ట్విట్టర్‌లో కనిపించిన ఓ ట్వీట్ రామ్ ఫ్యాన్స్‌ని మరింత షాక్‌కి గురి చేసింది. మూవీ స్టార్ట్ అయి 8 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడం, మధ్యలో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయిందన్న వార్త వినిపించడం కారణంగా అందరూ నిజమనే అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదంట. చిత్రీకరణ ఆగిపోయినట్లు వచ్చిన వార్తలు ఫేక్ అని, అవి ఫేక్ అకౌంట్ ద్వారా ఎవరో క్రియేట్ చేశారని తెలిసింది. అసలు విషయం తెలుసుకున్న అభిమానులు.. ఫేక్ ట్వీట్ చేసిన వారిని బూతులు తిడుతున్నారు.

ఇవి కూడా చదవండి : వాడొక నీచ్ కమీన్ కుత్తే.. కేజీఎఫ్‌ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ (వీడియో)



Next Story

Most Viewed