ఆమె ఫ్యాన్స్ నా ఇంటిపై రాళ్లు విసిరారు.. పేరు కూడా మార్చుకోమన్నారు

by Disha Web Desk 23 |
ఆమె ఫ్యాన్స్ నా ఇంటిపై రాళ్లు విసిరారు.. పేరు కూడా మార్చుకోమన్నారు
X

దిశ, సినిమా: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటీ జయలలిత తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాల గురించి మాట్లాడిన ఆమె.. ‘స్టార్ దర్శకుల చిత్రాల్లో నటించినప్పటికీ నా పాత్ర చాలా తక్కువ సమయం ఉండేది. అది నాకు తృప్తినిచ్చేది కాదు. తర్వాత కొన్ని సినిమాల్లో వ్యాంప్ రోల్స్‌లో నటించే అవకాశాలు వచ్చాయి. నన్ను ఎక్కువ శాతం బోల్డ్ క్యారెక్టర్స్‌కే పరిమితం చేశారు. ఒకసారి నా పేరు వల్ల తమిళ్‌ రాజకీయ నేత జయలలితకు అవకాశాలు రాకుండా పోతున్నాయని, ఆమె పేరు పెట్టుకోని అలాంటి పాత్రలో నటిస్తున్నావంటూ మా ఇంటిపై కొంతమంది రాళ్లు విసిరారు. పేరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు’ అని గతాన్ని గుర్తుచేసుకుంది.

ఇవి కూడా చదవండి: నీకు భర్త తప్ప అందరూ కావాలి.. మెగా డాటర్‌పై ట్రోలింగ్


Next Story

Most Viewed