- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ షోపై సినీ నటి ఘాటు వ్యాఖ్యలు
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 ఇప్పటికే నెటిజన్లతో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 ఇప్పటికే నెటిజన్లతో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తాజాగా హీరోయిన్ మాధవీలత ఈ షోపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘బిగ్ బాస్ 100% ఒక కమర్షియల్ షో. అందులో సామాన్యులను తీసుకుంటే షోను ఎవడూ దేకడు. టీఆర్‌పీ కూడా రాదు. సో పిచ్చ ఆలోచనల్ని మానేసి, చూసేటోళ్లు చూడండి అంతే. ఎవడిని పెడితే దేకుతారో వాళ్లనే పెడ్తరు.. ఈ సీజన్‌కు చాలామంది ట్రై చేశారు. కానీ మీ డబ్బు వద్దు మాకు ఇజ్జత్ ముఖ్యమని మస్త్ మంది టాటా బై బై చెప్పారు ఆ షోకి. సో ఉన్నవాళ్లతో అడ్జస్ట్ అవ్వండి. నన్ను చూడమని అడగవద్దు. థాంక్యూ.’’ అంటూ బిగ్‌బాస్‌షోపై వ్యతిరేకంగా ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






