‘Guntur Kaaram’ నుంచి ఫైట్ మాస్టర్‌లు కూడా తప్పుకున్నారా?

by Dishanational2 |
‘Guntur Kaaram’ నుంచి ఫైట్ మాస్టర్‌లు కూడా తప్పుకున్నారా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లు‌గా నటిస్తున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ మూవీ షూటింగ్ మళ్లీ రీస్టార్ట్ కానుంది. కానీ ఇంతలోనే మరో ఊహించని వార్త వైరల్ అవుతోంది. ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటినుంది ఒక్కొక్కరు వరుస పెట్టి మూవీ నుంచి తప్పుకుంటున్నారు. ముందు పూజా హెగ్దే, తర్వాత తమన్, ఇప్పుడు ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు కూడా మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇది ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ లాగా లేదు ‘బిగ్ బాస్ షో’లాగే ఉంది. ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతున్నట్లు వెళ్లిపోతున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు ఫ్యాన్స్.

Also Read: పాన్ ఇండియా సినిమాలో Jyothika?

Next Story

Most Viewed