ఫిజికల్ టచెస్ అవసరం.. రోజుకు 12 హగ్గులు కచ్చితంగా ఉండాల్సిందేనంటూ ఫిదా బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-03 04:15:23  IST  )

టాలీవుడ్ నటి గాయత్రి గుప్తా(Gayatri Gupta) ‘ఐస్‌క్రీమ్-2’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఫిజికల్ టచెస్ అవసరం.. రోజుకు 12 హగ్గులు కచ్చితంగా ఉండాల్సిందేనంటూ ఫిదా బ్యూటీ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటి గాయత్రి గుప్తా(Gayatri Gupta) ‘ఐస్‌క్రీమ్-2’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇక వరుణ్ తేజ్ ‘ఫిదా’ (fida)చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. చివరగా ‘సీతా ఆన్ ది రోడ్’ (Sita on the Road)సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న గాయత్రి నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, గాయత్రి గుప్తా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘ఒక రోజుకు నాకు 12 హగ్గులు కావాలి. అది కూడా అక్క, నాన్న, అమ్మ లేదా ఇంకెవరైనా నుంచి, దురుద్దేశం లేని స్పర్ష కావాల్సి ఉంటుంది.

కనీసం 20 సెకండ్ల వరకైనా హగ్ చేసుకోవాలి. అప్పుడే సేఫ్‌ అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడే మన బాడీ సేఫ్ అని ఫీల్ అవుతాం. ఈ సమాజంలో మనం సురక్షితంగా ఉన్నమనే ఫీలింగ్ అప్పుడే కలుగుతుంది. గతంలో మనకు ఫిజికల్ టచెస్ దొరికేవి. అందుకే అప్పుడు అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోబోల్లాగా పరుగెడుతూనే ఉన్నాము.ఫిజికల్ టచ్ కాదుగా.. చిల్ అవ్వడానికి టైమ్ కూడా దొరకట్లేదు. జంతువులు ఆకలి అయినప్పుడు వేటాడుతాయి.. మిగతా టైమ్‌లో చిల్ అవుతాయి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొందరు షాక్ అవుతున్నారు.

Next Story