- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా తల్లి అలాంటిదంటూ ఫిదా బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్.. దారుణంగా తిడుతున్న నెటిజన్లు
టాలీవుడ్ బ్యూటీ గాయత్రి గుప్తా(Gayatri Gupta) ‘ఐస్‌క్రీమ్-2’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ గాయత్రి గుప్తా(Gayatri Gupta) ‘ఐస్‌క్రీమ్-2’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత వరుణ్ తేజ్-సాయి పల్లవి జంటగా నటించి ‘ఫిదా’(fida) మూవీతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. దీంతో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత పాపులారిటీని దక్కించుకోలేకపోయింది. చివరగా.. ‘సితా ఆన్ ది రోడ్’ (Sita on the Road)చిత్రంలో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ నిత్యం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా తన తల్లి బండారం బయటపెట్టింది. ‘‘నాకు పెళ్లై విడాకులు కూడా తీసుకున్నాను. అయితే వివాహం తర్వాత అప్పగింతల్లో నేను మా అమ్మను కౌగిలించుకుని బాధపడ్డాను. ఆ సమయంలో ఆమె చెప్పిన మాటలకు నేను షాక్ అయ్యాను.
చెవిలో నిన్ను వదిలించుకోవడానికే పెళ్లి చేశాను. మళ్లీ నా జీవితంలోకి రాకు. నా లైఫ్‌లోంచి వెళ్లిపో అని చెప్పి ఏం తెలియనట్లుగా బై బేటా అని అందరి ముందు నటించింది. అక్కడి నుంచి మా అమ్మ వెళ్లిపోవడంతో నేను షాక్‌లో ఉన్నాను. నా మనసు విరిగిపోయింది. ఒక అమ్మ అందరి ముందు ఒకలాగా.. ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా.. నా దగ్గర ఒకలా ఎలా ఉండగలుగుతారు అని షాక్ అయిపోయాను. నాకు మా అమ్మ మెంటాలిటీ ముందే తెలుసుంటే ఇంట్లోంచి ఎప్పుడో పారిపోయేదాన్ని. అందుకే నాకు పెళ్లి అన్నా.. పెద్దలన్నా భయం. భయపడను కానీ అదొక రకమైన ఫీలింగ్’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు గాయత్రిని తిడుతున్నారు. ఏ తల్లి అలా చెప్పదు నువ్వు అన్ని అబద్ధాలు చెప్పకు అని దుమ్మెత్తిపోస్తున్నారు.






