ప్రేమ మాయాజాలాన్ని అనుభూతి చెందండి: సోనమ్ బజ్వా

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సోనమ్ బజ్వా(Sonam Bajwa) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తీరక లేకుండా గడుపుతోంది.

ప్రేమ మాయాజాలాన్ని అనుభూతి చెందండి: సోనమ్ బజ్వా
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సోనమ్ బజ్వా(Sonam Bajwa) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తీరక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న సినిమాల్లో ‘నిక్కాజలిదార్-4’ (Nikkajalidar-4)ఒకటి. ఈ సినిమా ‘నిక్కాజలిదార్-3’కు సీక్వెల్‌గా రాబోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సిమెర్జిత్ సింగ్ (Simerjit Singh)దర్శకత్వం వహిస్తున్నారు. రెజ్లింగ్ పై ఆసక్తి లేని ఓ పంజాబీ వ్యక్తి, ఉత్సాహభరితమైన హర్యాన్వీ స్త్రీని కలిస్తాడు. పరిచయం కాస్త ప్రేమగా మారిన తర్వాత తన ప్రపంచం మారిపోయినట్లుగా గ్రహిస్తాడు. వారు ప్రేమలో పడిన తర్వాత ఏం జరిగింది ఎలాంటి.. ప్రమాదాలు ఎదుర్కొన్నారనేది ఈ మూవీ కథ. దీనిని గున్బీర్ సింగ్ సిద్ధూ, మన్మోర్డ్ సిద్ధూ, అమ్నీత్ షేర్ సింగ్, రాంనీత్ షేర్ సింగ్ నిర్మిస్తున్నారు.

ఇందులో సోనమ్ అమ్మీ విర్క్, నిర్మల రిషి, నిషా బానో, సోనియా కౌర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సోనమ్ వరుస అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈక్రమంలో.. తాజాగా, సోనమ్ బజ్వా ‘నిక్కాజలిదార్-4’చిత్రానికి సంబంధించిన ఓ ప్రేమ పాట రాబోతున్నట్లు ప్రకటించింది. ‘‘సెప్టెంబర్ 28న విడుదలవుతున్న మా సినిమా పాటతో ప్రేమ మాయాజాలాన్ని అనుభూతి చెందండి. మీ హృదయాన్ని వెచ్చదనంతో నింపే మనోహరమైన ఈ సాంగ్‌ను మీ ప్లే లిస్ట్‌లో చేర్చుకోండి’’ అనే క్యాప్షన్ జత చేసింది.

Next Story