- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mrunal Thakur: ఫిబ్రవరి 14 ఫూల్స్ డేలా అనిపిస్తుంది.. ధనుష్‌తో పెళ్లిపై మృణాల్ రియాక్షన్ ఇదే!
నేను పెళ్లి చేసుకోవడం లేదు. నాకు తెలిసి ఫిబ్రవరి 14వ తేదీ ఈసారి ఏప్రిల్ ఫూల్స్ డే కాబోతోంది.

దిశ, సినిమా: సీతమ్మగా అందరి మనసులు గెలుచుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నిత్యం వార్తల్లో నిలుస్తుంది. కోలీవుడ్ స్టార్ ధనుష్(Dhanush)తో ప్రేమలో ఉందని.. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 14న, అంటే వాలెంటైన్స్ డే రోజే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. వీరిద్దరు పలు పార్టీల్లో కలిసి కనిపించడంతో.. పుకార్లకు బలం చేకూరినట్లు అయింది. 2025లో ధనుష్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా ర్యాప్-అప్ పార్టీకి మృణాల్ హాజరు కావడంతో వీరి మధ్య ఏదో ఉందనే చర్చ మొదలైంది. ఆ తర్వాత 2026 ప్రారంభంలో ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్ షోలో ధనుష్‌ను మృణాల్ ఆహ్వానించి, ఆప్యాయంగా హగ్ చేసుకోవడంతో అంతా వీరిద్దరి మధ్య ఏదో ఉందని గట్టిగా నమ్మారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ పెళ్లిపై స్పందించింది. తన కొత్త సినిమా ‘దో దివానే సెహర్ మే’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వార్తలను ఆమె కొట్టిపారేసింది.
ఫిబ్రవరి 14 నాకు ఏప్రిల్ ఫూల్స్ డే!
పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు మృణాల్ నవ్వుతూ సమాధానమిస్తూ.. "నేను పెళ్లి చేసుకోవడం లేదు. నాకు తెలిసి ఫిబ్రవరి 14వ తేదీ ఈసారి ఏప్రిల్ ఫూల్స్ డే కాబోతోంది. ఈ వార్తలను ఎవరు మొదలుపెట్టారో నాకు తెలియదు. నేను ఎప్పుడూ చెప్పని మాటలను కూడా నేను చెప్పినట్టుగా కొందరు వార్తలు రాసేస్తున్నారు. ఇది చూడటానికి అందంగా ఉన్నా, నిజానికి చాలా భయంకరంగా ఉంది’’ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది. ఆమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. త్వరలో మృణాల్ ‘దో దివానే సెహర్ మే’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది.






