ఆ పార్ట్‌పై టాటూ వేయించుకున్న ఫరియా అబ్దుల్లా.. సీక్రెట్ రివీల్ చేసి షాకిచ్చిన బ్యూటీ!

by Disha Web Desk 6 |
ఆ పార్ట్‌పై టాటూ వేయించుకున్న ఫరియా అబ్దుల్లా.. సీక్రెట్ రివీల్ చేసి షాకిచ్చిన బ్యూటీ!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె లాయర్ పాత్రలో నటించి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల పొట్ట చక్కలయ్యేలా నవ్వించింది. ఈ చిత్రం హిట్ కావడంతో ఫరియాకు పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తోంది.

ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. తాజాగా, మేకర్స్ ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రామానికి గెస్ట్‌గా టాలీవుడ్ హీరో నాని హాజరై ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈ ఈవెంట్‌లో ఫరియా అబ్దుల్లా టాటూ ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది.

దీనిపై యాంకర్ ఫరియాను ప్రశ్నించగా.. ఆమె స్పందిస్తూ.. ‘‘ ఈ టాటూ చెట్ల వేర్లు మారిదిగా ఉంటాయి. నేను పర్సనల్‌గా నమ్మేది ఏంటంటే.. ఏరులు ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం అంత ఎదగగలం అన్నమాట. సెలబ్రిటీ లైఫ్‌లో ఒదిగి ఉండటం ఎంతో అవసరం. ఆ విషయాన్ని నాకు పదే పదే గుర్తు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా టాటూ వేయించుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఫరియా కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇలా కూడా చేస్తారా? అని షాక్ అవుతున్నారు.



Next Story