అది బాలీవుడ్ కాదు.. టాలీవుడ్: స్టార్‌ నటిపై ట్రోలింగ్

by Disha Web Desk 6 |
అది బాలీవుడ్ కాదు.. టాలీవుడ్: స్టార్‌ నటిపై ట్రోలింగ్
X

దిశ, సినిమా : హాలీవుడ్‌ స్టార్ నటి జెన్‌ ఫోండా నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇటీవల 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాపై ప్రశంసలు కురిపించిన ఆమె బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు షార్ట్‌ లిస్ట్‌ అయిందనే వార్త తనను ఆశ్యర్యానికి, సంతోషానికి గురిచేసిందని చెప్పింది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ షేర్ చేస్తూ.. 'నేను గతంలో చాలామందికి 'లెస్లీ' సినిమా చూడమని చెప్పాను. కానీ, దానికి పూర్తి భిన్నంగా తెరకెక్కిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా నన్ను ఊహించని రీతిలో సర్‌ప్రైజ్ చేసింది. బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఈ మూవీ ఆస్కార్‌కు షార్ట్‌ లిస్ట్‌ కావడాన్ని నేను స్వాగతిస్తున్నా. సామ్రాజ్యవాదం గురించి సీరియస్‌గా చర్చించిన ఈ బాలీవుడ్ సినిమా చూస్తూ పరివర్తన చెందాను' అంటూ తనదైన స్టైల్‌లో రాజమౌళీ టీమ్‌ను పొగిడేసింది. అయితే ఈ పోస్ట్‌‌లో టాలీవుడ్ చిత్రాన్ని బాలీవుడ్ అని చెప్పడంపై ఫన్నీగా స్పందిస్తున్న నెటిజన్లు.. 'హలో అమాయక జెన్ ఫోండా. అది బాలీవుడ్ చిత్రం కాదు. టాలీవుడ్ చిత్రం' అంటూ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

Next Story