ఫ్యాన్స్ గెట్ రెడీ.. సెలబ్రేషన్స్‌కి పర్ఫెక్ట్ ఉండే అప్డేట్ రాబోతుంది

by Mallepaka Hamsa |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(Andhra King Taluka).

ఫ్యాన్స్ గెట్ రెడీ.. సెలబ్రేషన్స్‌కి పర్ఫెక్ట్ ఉండే అప్డేట్ రాబోతుంది
X

దిశ, సినిమా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(Andhra King Taluka). పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు (Mahesh Babu)పి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రమోషనల్ మెటీరియల్‌తో ఈ సినిమా భారీ బజ్‌ను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్, పాటలు, టీజర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో మూవీపై భారీ అంచనాలను పెంచాయి. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా, ఫోర్త్ సింగిల్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సెలబ్రేషన్స్‌కి పర్ఫెక్ట్ ఉండే ఈ సాంగ్ నవంబర్ 12న విడుదల కానుంది. రామ్ సెలబ్రేషన్స్ మోడ్‌లో ఉన్న సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది. కాగా, ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. రావు రమేశ్‌, మురళీ శర్మ, సత్య, రాహుల్‌ రామకృష్ణ, వీటీవీ గణేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ నవంబర్‌ 28న థియేటర్లలో విడుదల కానుంది.

Next Story