రోజు రోజుకు త‌మ‌న్నలోని మార్పును త‌ట్టుకోలేక‌పోతున్నాం అంటున్న ఫ్యాన్స్..!

by Disha Web Desk 10 |
రోజు రోజుకు త‌మ‌న్నలోని మార్పును త‌ట్టుకోలేక‌పోతున్నాం అంటున్న ఫ్యాన్స్..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌‌తో దూసుకుపోతుంది. అవకాశాలు తగ్గుతున్నా కొద్ది ఎక్కడ కూడా తగ్గకుండా కసిగా.. సెకెండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టేసింది. ఐటెమ్ సాంగ్స్, గెస్ట్ రోల్స్‌తో అద‌ర‌గొడుతుంది. ముఖ్యంగా ముందెన్నడూ చూడని విధంగా స్కిన్ షో చేస్తూ రెచ్చిపోతుంది. వృత్తి ప‌రంగా తనలోని మరో యాంగిల్‌ను చూపిస్తుంది. ఇక మూవీస్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్న తమన్న.. ఎప్పటికప్పుడు హాట్ లుక్‌తో అలరిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా మ‌రో కొత్త ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోస్ షేర్ చేసింది. చీరకట్టులో మిల్కీ అందాలతో మెరుపులు మెరిపించింది. చీరకట్టిన విధానం.. రెడ్ లిప్ స్టిక్.. యాక్సర‌సీస్.. ఇలా ప్రతీది ఈ భామను మ‌రింత అందంగా మార్చేసాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుండగా.. ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘రోజురోజుకు తమన్నలోని మార్పును చూడలేకపోతున్నాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed