ఆ హీరోయిన్‌ను ఫాలో అవ్వని శ్రీలీల.. మండిపడుతున్న ఫ్యాన్స్

by sudharani |
ఆ హీరోయిన్‌ను ఫాలో అవ్వని శ్రీలీల.. మండిపడుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ శ్రీలీల. ఇక తర్వాత వచ్చిన రవితేజ ‘ధమకా’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. యంగ్ అండ్ సీనియర్ హీరోలు సైతం ఈ అమ్మడినే హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకుంటున్నారు. అయితే.. ఈ అమ్మడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేస్తున్నప్పటికీ అన్ని నిరాసకు గురిచేస్తున్నాయి. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా హిట్ అయినప్పటికీ.. శ్రీలీల కెరీర్‌కు ఈ మూవీ అంతగా ఉపయోగపడలేదు.

ఇక రీసెంట్‌గా వచ్చిన మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సైతం మిక్సిడ్ టాక్ రావడంతో.. ప్రజెంట్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది ఈ బ్యూటీ. అంతే కాకుండా.. తన అందాలతో, డ్రెస్సింగ్ స్టైల్‌తో అభిమానులను ఆకర్షిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. శ్రీలీలపై కొంతమంది అభిమానులు చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు ఎవరో కాదు. మన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫ్యాన్స్. రష్మిక ఫ్యాన్స్ శ్రీలీలపై కోపంగా ఉండటం ఏంటీ..? అసలు వీరి మధ్య గొడవ ఏంటీ..? అనుకుంటున్నారా.

అసలు విషయం ఏంటంటే.. శ్రీలీల తన ఇన్‌స్టా గ్రామ్‌లో చాలా మంది సెలబ్రెటీలను ఫాలో అవుతోందట. కానీ ఆ లిస్ట్‌లో రష్మిక లేదట. ఇందులో తప్పు ఏముంది అనుకుంటున్నారా..? ఇక్కడే వచ్చింది అసలు చిక్కాంత. రష్మిక కూడా కన్నడ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. అయితే.. శ్రీలీల ఇలా కన్నడకు చెందిన చాలా మంది హీరోయిన్స్‌ను ఫాలో అవుతున్నప్పడు రష్మికను ఎందుకు ఫాలో అవ్వదు అంటున్నారు నేషనల్ క్రష్ ఫ్యాన్స్. మరి ఈ గొడవలకు బ్రేక్ ఎప్పుడు పడుతుందో తెలియదు కానీ, అసలు శ్రీలీల రష్మికను ఫాలో అవ్వకపోవడానికి కారణం ఏముంటది అంటూ నెట్టింట జుట్టు పీక్కుంటున్నారు కొందరు నెటిజన్లు.

Read More..

ఆ హిట్ సినిమా రీమేక్‌లో శ్రీదేవి కూతురు..!



Next Story