చరణ్‌ను ఫాలో అయిపో.. అఖిల్‌‌కి సలహా ఇస్తున్న ఫ్యాన్స్

by Disha Web Desk 10 |
చరణ్‌ను ఫాలో అయిపో.. అఖిల్‌‌కి సలహా ఇస్తున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ మూవీ ‘ఏజెంట్’. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 28న గ్రాండ్‌గా విడుదలైన సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి రెండు రోజుల్లోనే సినిమా కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి. దీంతో రూ. 80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ, కనీసం రూ.8 కోట్ల షేర్ రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు అఖిల్ నటించిన చిత్రాలను దృష్టిలో ఉంచుకుని అభిమానులు పలు సూచనలు ఇస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ఫాలో అయిపోమని సూచిస్తున్నారు. చరణ్‌ మాదిరిగా కెరీర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నారు. ఇలా నేరుగా కమర్షియల్ యాక్షన్ ప్రాజెక్ట్‌లలోకి దూకడం కంటే ముందుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు చేస్తే బెటర్ అంటున్నారు. ‘రంగస్థలం’ లాంటి కెరీర్ మలుపు తిప్పే సినిమాలకు సైన్ చేయాలని సజెస్ట్ చేస్తున్నారు.

Next Story