Ram Charan పాప జాతకం అలా చెప్పడం కరెక్ట్ కాదంటూ Venu Swamy పై మండిపడ్డ ప్రముఖ స్వామిజీ!

by Disha Web Desk 9 |
Ram Charan పాప జాతకం అలా చెప్పడం కరెక్ట్ కాదంటూ Venu Swamy పై మండిపడ్డ ప్రముఖ స్వామిజీ!
X

దిశ, వెబ్‌డెస్క్: సెలబ్రిటీల జాతకాల గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తరచూ వార్తల్లో నిలుస్తారు. అయితే ఇటీవల రామ్ చరణ్-ఉపాసన పాప జాతకం గురించి ఆయన వీడియో ద్వారా వెల్లడించారు. దీంతో ఊహ తెలియని చిన్నారి జాతకాన్ని ఇప్పుడే చెప్పడం అవసరమా..? అంటూ చరణ్ ఫ్యాన్స్ వేణు స్వామిపై మండిపడుతున్నారు. తాజాగా మరో ప్రముఖ జ్యోతిష్యుడు రాధా మనోహర్ దాస్ అనే స్వామిజీ వేణుస్వామి గురించి మాట్లాడుతూ.. ఈ పైత్యం ప్రతిదానిపై చూపించడం సరికాదని అన్నారు.

‘‘రామ్ చరణ్ ఒక ఊరిలో శివునికి సేవ చేస్తారని ఆ శివ సేవా ఫలం వల్ల వాళ్లింట్లో అమ్మవారే జన్మించారని నేను భావిస్తున్నానని’ వేణుస్వామి కామెంట్లు చేశారు. ‘పెళ్లైన పదేళ్ల తర్వాత ఆ ఇంటికి అమ్మవారు వచ్చారని ఆ చిన్నారి జాతకం చిన్నారి కుటుంబ సభ్యులకు వేణుస్వామి చెబితే సరిపోతుందని, అలా జాతకం బయటకు చెప్పకూడదని సెలబ్రిటీల పిల్లలు కాబట్టి ఆ ఇంగితం అనేది లేకుండా కొంతమంది జ్యోతిష్యులు ప్రవర్తిస్తారని, వృత్తిని బట్టి కులం ఉంటుందని.. ఆరాధనను బట్టి మతం ఉంటుందని’’ రాధా మనోహర్ దాస్ తెలిపారు. ఇక వేణుస్వామి దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే.

Next Story