ఉత్కంఠగా ‘చిరంజీవ’ ట్రైలర్.. ఈ సినిమా ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కాబోతుందంటే?

by Mallepaka Hamsa |

రాజ్ తరుణ్ (Raj Tarun)హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ‘చిరంజీవ’(Chiranjeeva). ఈ చిత్రంలో కుషిత కల్లపు(Kushita Kallapu) హీరోయిన్‌గా నటించింది.

ఉత్కంఠగా ‘చిరంజీవ’ ట్రైలర్.. ఈ సినిమా ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కాబోతుందంటే?
X

దిశ, సినిమా: రాజ్ తరుణ్ (Raj Tarun)హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ‘చిరంజీవ’(Chiranjeeva). ఈ చిత్రంలో కుషిత కల్లపు(Kushita Kallapu) హీరోయిన్‌గా నటించింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. నవంబర్ 7వ తేదీ నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈనేపథ్యంలో, ప్రమోషన్స్‌లో భాగంగా.. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. చిరంజీవ మూవీ ట్రైలర్ ఎంటర్‌టైన్‌మెంట్, లవ్, యాక్షన్‌తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ ట్రైలర్ గమనించినట్లైతే.. శివ(రాజ్ తరుణ్) పుట్టగానే మహార్జాతకుడు అవుతాడని పండితులు చెబుతారు. శివకు చిన్నప్పటి నుంచి స్పీడు ఎక్కువ.

ఆంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న శివ ఓ రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. అతనికి తెలియకుండానే కొన్ని శక్తులు వచ్చేస్తాయి. ఎవరెవరు ఎంతకాలం జీవిస్తారు అనేది శివకు తెలిసిపోతుంటుంది. ఈ క్రమంలోనే శివ రౌడీ సత్తు పైల్వాన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సత్తు పైల్వాన్‌తో చేసిన పోరాటంలో శివ గెలిచాడా లేదా అనేది ట్రైలర్‌లో ఉత్కంఠను కలిగించింది. హీరో హీరోయిన్స్ కుషిత కల్లపు, రాజ్ తరుణ్ పాత్రల మధ్య వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంది. చిరంజీవ సినిమా ఆహా ఓటీటీకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానుందని టీజర్‌తో అర్థయవుతోంది. దీంతో సినీ ప్రియులంతా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తు్న్నారు.

Next Story