ఆ సినిమా రిలీజ్ రోజు ఎగ్జామ్స్ వాయిదా వేస్తాం.. మంత్రి మల్లారెడ్డి ప్రకటన

by Disha Web Desk 7 |
ఆ సినిమా రిలీజ్ రోజు ఎగ్జామ్స్ వాయిదా వేస్తాం.. మంత్రి మల్లారెడ్డి ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. ఆయన కామెంట్స్ కాంట్రవర్సీగానో.. హాస్యంగానో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘పాలమ్మినా.. కట్టెలమ్మినా.. ’అంటూ ఆయన చేసిన కామెంట్స్ మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా చేయమని దర్శకుడు హరీశ్ శంకర్ బతిమిలాడారని చెప్పుకొచ్చిన మంత్రి.. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇటీవల జరిగిన సీఎంఆర్ కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి, హీరో నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులందరూ కాలేజీ డుమ్మా కొట్టి మే 12న ‘కస్టడీ’ సినిమాను చూడాలని, హాలీడే ఇస్తాం.. ఆరోజు ఏవైనా పరీక్షలున్నా వాయిదా వేస్తామని అన్నారు. అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ.. ఈ సినిమా డైలాగ్స్ కంటే మల్లారెడ్డి స్పీచ్‌లే ఎక్కువగా ఫేమస్ అవుతున్నాయని అన్నారు.

కాగా, మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. పరీక్షల సమయంలో చదువుకోవాలని చెప్పాలి కానీ.. ఇలా ఓ సినిమా కోసం ఎగ్జామ్స్ ఉన్నా వాయిదా వేస్తా అని ప్రకటించడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. కాలేజీ ఉమ్మా కొట్టి మూవీ చూడాలని మంత్రి పిలుపునివ్వడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వేధిక ఏదైనా.. వెనకాముందు చూడకుండా మంత్రి మల్లారెడ్డి చేసే కామెంట్స్ ఆ తర్వాత ఆయన మెడకే చుట్టుకోవడం కొత్తేమి కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: అట్రాక్ట్ చేస్తున్న ‘రుద్రుడు’ థియేట్రికల్ ట్రైలర్



Next Story

Most Viewed