ఈ ప్రయాణంలో జరిగినవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-22 08:16:36  IST  )

రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘కిరీక్ పార్టీ’తో వచ్చి నేషనల్ క్రష్‌గా మారి ఇండస్ట్రీనీ ఏలేస్తోంది.

ఈ ప్రయాణంలో జరిగినవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘కిరీక్ పార్టీ’తో వచ్చి నేషనల్ క్రష్‌గా మారి ఇండస్ట్రీనీ ఏలేస్తోంది. భాషతో సంబంధం లేకుండా..వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ అందాల తార యానిమల్, పుష్ప వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను తన నటన, అందంతో మెస్మరైజ్ చేసింది. గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న రష్మిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ భామ మొదటిసారి హారర్ థ్రిల్లర్ ‘థామా’ (Thamma)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. తాజాగా, రష్మిక ‘థామా’ షూటింగ్ విషయాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది.

పలు ఫొటోలు షేర్ చేస్తూ కీలక నోట్ విడుదల చేసింది. అందులో ఏముందంటే.. ‘‘ఈ సినిమా ప్రయాణాన్ని ఎలా వివరించాలి. మొదటి రోజు నుంచి చివరిరోజు వరకు ప్రతీదీ నా మనసుకు హత్తుకున్నదే. వర్క్ చేయడమే కాదు.. భరోసా, నవ్వులు, గాయాలు, నిద్రలేవడానికి ఇష్టపడని ఉదయాల ఉన్నాయి. షూటింగ్ ముగించడానికి అంగీకరించని రాత్రులు ఇవన్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. దర్శకుడు ఆదిత్య(Aditya) నాపై నమ్మకంతో ‘థామా’ తెరకెక్కించారు. ప్రతి సీన్‌లో ఆయన అంకితభావం కనిపిస్తుంది. అలాగే ఈ మూవీ టీమ్ గురించి ఎంత చెప్పినా సరిపోదు. చాలా కష్టపడి ఎంత్తైన కొండ ప్రదేశాలకు కూడా పరికరాలను కష్టం అనుకోకుండా మోసుకొచ్చి మాకు సహకరించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టమంతా..ప్రేక్షకులు పాజిటివ్ కామెంట్స్ చూసి మర్చిపోతాం. ‘థామా’ విషయంలో అదే జరిగింది’’ అని రాసుకొచ్చింది.

READ MORE ......

సంచలన నిర్ణయం తీసుకున్న రేణు దేశాయ్.. సన్యాసిగా మారతానంటూ షాకింగ్ కామెంట్స్

Next Story