‘సఃకుటుంబానాం’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-29 13:19:25  IST  )

రామ్ కిరణ్(Ram Kiran), మేఘ ఆకాష్(Megha Akash) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సఃకుటుంబానాం’(Sah Kutumbanam).

‘సఃకుటుంబానాం’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
X

దిశ, సినిమా: రామ్ కిరణ్(Ram Kiran), మేఘ ఆకాష్(Megha Akash) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సఃకుటుంబానాం’(Sah Kutumbanam). హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం కీలకపాత్రలో పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కొద్ది రోజుల క్రితమే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్ర విడుదల వాయిదా పడగా.. కొత్త తేదీని మేకర్స్ ప్రకటించారు. 2026 సంవత్సరంలో అందరి జీవితాలు మరింత వెలుగు పొందాలని ప్రేక్షకులకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ‘సఃకుటుంబానాం’ చిత్ర బృందం నూతన సంవత్సర సందర్భంగా జనవరి 1వ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని వెల్లడించారు.

Next Story