‘దండోరా’ చూసి ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్ అవుతారు.. హైప్ పెంచుతున్న డైరెక్టర్ కామెంట్స్

by Mallepaka Hamsa |

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’(Dandora).

‘దండోరా’ చూసి ప్రతి ఒక్కరూ సర్‌ప్రైజ్ అవుతారు.. హైప్ పెంచుతున్న డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, సినిమా: లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’(Dandora). శివాజీ(Shivaji), న‌వ‌దీప్‌(Navdeep), నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను మురళీకాంత్ తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు మురళీకాంత్ మీడియాతో ముచ్చటించారు.

‘దండోరా’ కథ ఆలోచన ఎక్కడ, ఎలా మొదలైంది?

మాది మెదక్. నాకు ఓ మంచి సినిమాను తీయాలనే కోరిక ఉండేది. అమెరికాలో జాబ్ చేస్తుండేవాడిని. కానీ నాకు అది రొటీన్ లైఫ్ అని అనిపించింది. నేను అక్కడ కూడా ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడిని. అలా సినిమాల మీద ఇష్టంతో జీవితంలో రిస్క్ తీసుకుని ఇటు వైపు వచ్చాను. నా మెదడులో చాలా కథలు ఉన్నాయి. అయితే ప్రేమ కథల్ని నెరేట్ చేయడం చాలా కష్టం. అందుకే ఓ కాన్సెప్ట్, మూలాల్లోని కథ చెప్పాలని ఈ స్టోరీ అనుకున్నాను. పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో మంది, ఎన్నో రకాల లైఫ్ స్టైల్స్ తెలుస్తాయి. సమాజంలోని అసమానతల మీద కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘దండోరా’ తీశాను.

‘దండోరా’ నుంచి ఆడియెన్స్ ఏం ఆశించి థియేటర్‌కు రావాలి?

‘దండోరా’ టైటిల్ వినగానే అందరి మైండ్‌లో ఎన్నో ఊహాగానాలు వచ్చి ఉంటాయి. కథ అలా ఉంటుందా? ఇలా ఉంటుందా? ఈ పాయింట్ చెబుతున్నాడా? అని ఇలా పది అంశాల్ని ఊహిస్తారు. కానీ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సర్ ప్రైజ్ అవుతారు. మార్క్ కె రాబిన్ గారి మ్యూజిక్, ఆర్ఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో ఆర్ఆర్ అందరినీ కదిలిస్తుంది. ‘దండోరా’ చిత్రం, అందులోని స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఓ అందమైన అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సినీ ప్రియుల్లో ‘దండోరా’ మూవీపై హైప్ పెంచుతున్నాయి.

Next Story