నాపై చర్యలు తీసుకుంటారని అంటున్నారు అందరూ సంతోషంగా ఉండండి.. గీతూ రాయల్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ థాంక్స్. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను, పోగొట్టుకోవడానికి ఇంకా ఏం మిగలలేదు.

నాపై చర్యలు తీసుకుంటారని అంటున్నారు అందరూ సంతోషంగా ఉండండి.. గీతూ రాయల్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్ (Geethu Royal) కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. తన ముక్కుసూటి తనంతో, బోల్డ్ మాటలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ బ్యూటీ.. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో చిక్కుల్లో పడింది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నిబంధనలు ఉల్లంఘించి రీల్స్ చేసిందనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇటీవల తన స్నేహితులతో కలిసి తిరుమల వెళ్ళిన గీతూ.. శ్రీవారి సన్నిధిలో, పుష్కరిణి వద్ద, అలాగే ఘాట్ రోడ్ ప్రాంతాల్లో కొన్ని రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాధారణంగా తిరుమలలో ఇలాంటివి చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ, ఆమె వాటిని లెక్కచేయకుండా.. రీల్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. అది చూసిన నెటిజన్లు భక్తితో వెళ్ళారా? లేక షూటింగ్ కోసం వెళ్ళారా?" అంట ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో గీతూ రాయల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన బాధను వ్యక్తపరిచింది.

‘‘చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు అందరికీ థాంక్స్. ఇప్పటికే నా జీవితంలో సగం కోల్పోయాను, పోగొట్టుకోవడానికి ఇంకా ఏం మిగలలేదు. నాపై చర్యలు తీసుకుంటారని అంటున్నారు.. సరే అలాగే చేయండి, అందరూ హ్యాపీగా ఉండండి. మా టీమ్‌లో ఒకరికి టోకెన్ రాలేదు, అతని కోసం వెయిట్ చేస్తున్న సమయంలో స్వామివారి పాటలకు రీల్స్ చేశాను. దేవుడిపై భక్తి లేక కాదు, కేవలం ఆ సమయంలో సరదాగా చేశానంతే. నేను ఆ వీడియోలను డిలీట్ చేశాను. అయితే కామెంట్లకు భయపడి అలా చేయలేదు.. కర్మకు భయపడి చేశా. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఇలాంటి రీల్స్ చేసి ఇబ్బందుల్లో పడితే ఆ పాపం నాకే తగులుతుంది’’ అని చెప్పింది. అలాగే తాను గతంలో నమ్మకం లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. ‘‘గతంలో నాకు దేవుడిపై నమ్మకం ఉండేది కాదు. అప్పట్లో భక్తులను దూషించినందుకు విజయవాడ దుర్గమ్మ నాకు ఆరు నెలల పాటు కఠినమైన శిక్ష విధించింది. టాబ్లెట్స్ వేసుకోకపోతే నా శరీరం సహకరించేది కాదు. అప్పటి నుండి సనాతన ధర్మాన్ని నా రక్తంలోకి ఎక్కించుకున్నాను’’ అని చెప్పింది.

Next Story