మాపై ట్రోల్స్ చేసేది ఎవరో అందరికీ తెలుసు.. మంచు విష్ణు సంచలన కామెంట్స్

by Disha Web Desk 7 |
మాపై ట్రోల్స్ చేసేది ఎవరో అందరికీ తెలుసు.. మంచు విష్ణు సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిపై ట్రోల్స్ రావడం చాలా కామెన్. వాటిని కొంత మంది పట్టించుకుంటారు. మరికొందరు వదిలేస్తారు. కానీ, ఒక్కోసారి హద్దులు మీరి విమర్శిస్తున్నప్పుడు మాత్రం కొంత మంది హీరోలు స్పందిస్తారు. ఈ క్రమంలోనే.. ట్రోల్స్‌పై స్పందించాడు మంచు విష్ణు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో, ఆ తర్వాత మంచు ఫ్యామిలీపై విపరీతమైన ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ ట్రోల్స్‌పై మంచు అభిమానులు స్పందించిన పలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. అయిన తగ్గక పోవడంతో విష్ణు కూడా స్పందించాడు. అయితే తమపై ట్రోల్స్ చేసేది ఎవరో అందరికీ తెలుసంటూ మరోసారి స్పందించాడు విష్ణు.

‘తమపై ట్రోల్స్ చేస్తుంది.. చేయిస్తుంది ఎవరో ఇండస్ట్రీలో అందరకీ తెలుసు. అది ఒక స్నేక్ బ్యాచ్ పనే. కానీ, ఆ ట్రోల్స్ నేను పట్టించుకోను. ప్రస్తుత రోజుల్లో అందరూ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఈ ట్రోల్స్‌ను, విమర్శలను ఎవరూ పట్టించుకోరు. అయితే.. కొంతమంది డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేయిస్తున్నారు. అది చాలా తప్పు. కొన్ని సార్లు వారు మా మీద వేసే సెటైర్లు చాలా బాగుంటాయి.. వాటిని చూసి నవ్వుకుంటాము. అలా అని మితిమీరి ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదు. మా ఎలక్షన్ల ముందు వరకు నాపై ట్రోలింగ్స్ ఉండేవి కాదు. ఆ తర్వాతనే స్టార్ట్ అయ్యాయి. అవి ఎవరు చేయిస్తున్నారో కూడా అందరికీ తెలుసు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకులే’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఆ స్నేక్ బ్యాచ్ ఎవరూ..? వారి వెనుక ఉన్నది ఎవరూ..? అనే విషయాలు మాత్రం బయటపెట్టలేదు విష్ణు.



Next Story

Most Viewed