- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ప్రేమకూ ఓ చీకటి కోణం ఉంటుంది.. ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన అవికా గోర్
అవికా గోర్ సోషల్ మీడియా వేదికగా ‘అగ్లీ స్టోరీ’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అవికా గోర్, నటుడు నందు జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అగ్లీ స్టోరీ’ . చిన్నారి పెళ్లికూతురుగా తెలుగువారి మనసు గెలుచుకున్న అవికా, ఇటీవల తన వ్యక్తిగత జీవితంలో వివాహం చేసుకుని సెటిల్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో అవికా నటిస్తున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రణవ్ స్వరూప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ వరుస అప్‌డేట్స్‌తో అలరిస్తోంది. తాజాగా అవికా గోర్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.
మే 6న ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా, సినిమా విడుదల తేదీలో జరిగిన మార్పును కూడా ఆమె అధికారికంగా ప్రకటించింది. నిజానికి ‘అగ్లీ స్టోరీ’ మే 15న విడుదల కావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ కూడా విడుదల కాబోతుండటంతో.. బాక్సాఫీస్ వద్ద అనవసరమైన పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో, ‘అగ్లీ స్టోరీ’ మేకర్స్ తమ సినిమాను వారం రోజులు వాయిదా వేశారు. సమంత సినిమాకు లైన్ క్లియర్ చేస్తూ, ఈ చిత్రాన్ని మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలుపుతూ అవికా ఒక స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేసింది.
విడుదల తేదీని ప్రకటిస్తూ షేర్ చేసిన ఈ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో నందు, అవికాను ప్రేమగా హత్తుకుని ఉండగా.. ఆమె ముఖంలో మాత్రం ఏదో తెలియని ఆందోళన, భయం కనిపిస్తున్నాయి. రొమాంటిక్ థ్రిల్లర్ కావడంతో ఈ పోస్టర్ సినిమాలోని నిగూఢమైన రహస్యాలను సూచిస్తోంది. దీనికి తోడు “ప్రతి ప్రేమకూ ఒక చీకటి కోణం ఉంటుంది... మరి ఈ ప్రేమ అత్యంత కఠోరమైన వాస్తవం” అంటూ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. రియా జియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్యణ్ నిర్మిస్తున్.. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు ‘అగ్లీ స్టోరీ’ ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.






