- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందులో ప్రతి పాత్ర కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది: వరలక్ష్మి
స్త్రీలని గౌరవించడం మనందరి కర్తవ్యం. అలాంటి మంచి సందేశం ఉన్న సినిమా ఇది.

దిశ, సినిమా: వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి దోస డైరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో వరలక్ష్మి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకి విచ్చేసిన స్వప్న దత్ గారికి నందిని గారికి సిమ్రన్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. బాలయ్య గారికి నాని గారికి, అడివి శేష్ గారికి, ష్ సమంత గారికి, నయనతార గారికి, గోపి గారికి, బన్నీ వాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటులకు పేరుపేరునా కృతజ్ఞతలు. తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా నటీనటులు లేకపోతే సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది .ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు నా విజన్ ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇందులో ప్రతి పాత్ర కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది.
మా సినిమాకి వెన్నుముకగా నిలిచిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. పూజ చాలా కంట్రోల్ గా చేసింది. ఈ సినిమాతో మా నాన్నగారి ని గర్వపడేలా చేస్తానని నమ్ముతున్నాను. రాధిక గారి సపోర్ట్ ని మర్చిపోలేను. ఫ్యామిలీ అందరికీ థాంక్యు. మా ఆయన నిక్ సపోర్ట్ తోనే ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆయన ప్రతి అడుగులో ఎంతగానో ప్రోత్సహించారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నిక్. ఈ సందర్భంగా ప్రవీణ్ కి థాంక్యూ చెప్పాలి. తన కారణంగా డైరెక్షన్ స్టార్ట్ చేశాను. స్త్రీలని గౌరవించడం మనందరి కర్తవ్యం. అలాంటి మంచి సందేశం ఉన్న సినిమా ఇది. సోషల్ మెసేజ్ తో పాటు ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా నాకు చాలా గొప్ప ప్రేమ అభిమానాన్ని ఇచ్చారు. నావల్ల ఏమవుతుందో అది మీకు ఈ సినిమా ద్వారా ఇస్తున్నాను. ఫస్ట్ టైం చూసినవారు ట్విస్ట్ లని రివీల్ చేయకూడదని కోరుతున్నాను. మీ అందరి ప్రేమ అభిమానాలకు కృతజ్ఞతలు. మార్చి 6న తప్పకుండా ఈ సినిమా ధియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.






