- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమిట్‌మెంట్ సమస్యలు ఎదుర్కొన్నా.. అందుకే సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా: కళ్యాణి ప్రియదర్శన్
మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తోంది.

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం మార్షల్(Marshal)లో కార్తీ (Karthi)సరసన రొమాన్స్ చేయనుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా లైనప్ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. నా పాత్రకు న్యాయం చేయాలనుకుంటున్నాను. కమిట్‌మెంట్ సమస్యలు ఎదుర్కొన్నాను. అందుకే ఒకేసారి నాలుగు, ఐదు సినిమాలు కాకుండా ఓకే ప్రాజెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ప్రస్తుతం నేను కార్తీ సర్‌తో మార్షల్ చేస్తున్నాను. దానిపైనే నా దృష్టంతా పెడుతున్నాను.
దీనికి నేను 4 నెలలు సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. ఈ మూవీలోని పాత్ర కోసం నేనేం చేయగలనో ఆలోచిస్తున్నాను. ఎవరూ చేయలేని విధంగా చేయాలనుకుంటున్నా. ప్రతి నటికి లిమిట్స్ ఉంటాయి. కాబట్టి నేను కూడా ఈ పాత్రను పోషించగలనా లేదా అని ఆలోచిస్తూ అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత గ్రహించి.. నేను చేయగలను అనే నమ్మకం ఏర్పడింది. అయితే ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తే.. ఏదైనా జరగొచ్చు. ఇది నాకు నేర్చుకునే సమయం అనుకుంటున్నా రవి మోహన్ ‘జీనీ’ మూవీ పూర్తయింది.. విడుదలకు సిద్ధంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






