- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బయోపిక్ అని ప్రకటించిన కథలు కూడా కలిపితాలే.. కల్పితం లేకుండా చెప్పలేరంటూ డైరెక్టర్ సెన్సేషనల్ ట్వీట్
డైరెక్టర్ దేవకట్టా (Devakatta)తెలుగులో ఆటో నగర్ సూర్య, రిపబ్లిక్, డైనమైట్ వంటి చిత్రాలు తెరకెక్కించారు. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.

దిశ, సినిమా: డైరెక్టర్ దేవకట్టా (Devakatta)తెలుగులో ఆటో నగర్ సూర్య, రిపబ్లిక్, డైనమైట్ వంటి చిత్రాలు తెరకెక్కించారు. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం దేవకట్టా ‘మయసభ’(Maya Sabha). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో తమిళ నటుడు ఆది పినిశెట్టి(Adi Pinisetty) చంద్రబాబు నాయుడు నటిస్తుండగా.. కీడాకోలా అలరించిన చైతన్య రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్ సోనీ లివ్‌లో ఆగస్టు 7న స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ నెటిజన్ క్రియేటివిటీ స్టోరీనా రియల్ దా అని అడగ్గా దానికి డైరెక్టర్ స్పందిస్తూ..
‘‘ఓపెన్ గా బయోపిక్ అని ప్రకటించిన కథలు కూడా కలిపితాలే. డబ్భై ఎనభై ఏళ్ల ఒక వ్యక్తి జీవితాని ఎవరైనా మూడు గంటల్లో కల్పితం లేకుండా చెప్పగలరా?. ఉన్నతమైన మానవీయ భావాల్ని పెంచడానికి రాసే కథలు అంతకన్నా కల్పితం. ప్రతి రాజకీయ ప్రక్రియకీ ఇదే ధ్యేయం. శత్రుత్వాన్ని పెంచడం కాదు. ఈ పాత్ర పేరు కృష్ణమ నాయుడు (KKN). పేదరికం, నత్తి లాంటి బలహీనతల్ని అధిగమించి నాయకుడిగా ఎదిగిన పాత్ర’’ అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతున్నారు. బయోపిక్‌లు అంటే నిజజీవిత కథ ఆధారంగా వస్తాయనుకుంటే.. అవి కల్పితాలేనా అని ఆశ్చర్యపోతున్నారు.






