అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఎప్పుడు చనిపోయేది కూడా తెలియదు: Renu Desai

by Disha Web Desk 9 |
అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఎప్పుడు చనిపోయేది కూడా తెలియదు: Renu Desai
X

దిశ, సినిమా: అప్పట్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రేణు దేశాయ్.. పవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైపోయింది. ఆ తర్వాత అనుకొని కారణాల వనల పవన్‌తో విడాకులు జరగడంతో ప్రజంట్ తన ఇద్దరి పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. దీనిని బట్టి చూస్తే మనకు తెరమీద కనిపించేంత అందంగా సంతోషంగా, సినీ సెలబ్రిటీలు నిజ జీవితంలో ఉండరని అర్థమవుతుంది. ఇకపోతే ఈ మధ్య సెలబ్రేటిలు కొన్ని చిత్ర విచిత్రమైన వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ప్రజంట్ సమంత ఎంత బాధ పడుతుందో మనం చూస్తున్నాం. కెరీర్‌కి కూడా దూరమై చికిత్స కోసం విదేశాలలో తిరుగుతుంది. కాగా తాజాగా రేణు దేశాయ్ కూడా తాను ఒక అరుదైన వ్యాధితోనే బాధపడుతున్ననంటూ చెప్పుకొచ్చింది. ‘నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. ఈ సమస్య నాకు పుట్టుకతోనే వచ్చిందనే విషయం తెలియదు. ఒకసారి పరీక్షలు చేయించుకుంటే బయటపడింది. ఇప్పుడు మందులు వాడుతున్న. అందుకే లావు అయ్యాను. రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకుంటున్నా. మా నాన్నమ్మ కూడా ఇదే సమస్యతో 47 ఏళ్లకే ప్రాణాలు విడిచింది. మా నాన్న కూడా ఈ సమస్యతోనే చిన్నప్పుడే చనిపోయారు. నేను కూడా ఎప్పుడు పోతానో తెలియదు’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.


Next Story

Most Viewed