- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేము విడిగా ఉన్నా కూడా హ్యాపీయే.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్!
మేమిద్దరం విడిగా కూడా చాలా సంతోషంగా ఉంటాం. నన్ను ఎవరూ హాలిడేకి తీసుకెళ్లలేదని బాధపడే టైప్ నేను కాదు.

దిశ, సినిమా: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటుడు-నిర్మాత జాకీ భగ్నానీని ఫిబ్రవరి 21, 2024న గోవాలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, పెళ్లయిన ఏడాది దాటినా ఈ జంట తమ వైవాహిక బంధాన్ని ఒక కొత్త కోణంలో చూస్తున్నారు. సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ జంట.. తాజాగా.. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ తమ బంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాకీ మాట్లాడుతూ.. "మేము పెళ్లి చేసుకున్నాం, భార్యాభర్తలం. కానీ మా బంధాన్ని ఒక 'సిట్యుయేషన్ షిప్'గా పిలుచుకోవడం నాకు నచ్చుతుంది. అంటే, మేము ఒకరికొకరు ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటాం, కానీ మా మధ్య ఉండే స్వేచ్ఛాభరితమైన స్నేహం ఎప్పటికీ మారదు’’ అని చెప్పారు.
ఏదైనా విషయం గురించి రకుల్‌తో ఎంతటి విషయమైనా దాచుకోకుండా మాట్లాడగలగడమే ఈ బంధం వెనుక ఉన్న అసలైన బలం అని ఆయన తెలిపారు. ఇక రకుల్ మాట్లాడుతూ.. "మేమిద్దరం ఒకరి జీవితంలో ఉన్న శూన్యాన్ని నింపుకోవడానికి పెళ్లి చేసుకోలేదు. మేమిద్దరం విడిగా కూడా చాలా సంతోషంగా ఉంటాం. నన్ను ఎవరూ హాలిడేకి తీసుకెళ్లలేదని బాధపడే టైప్ నేను కాదు, నేను నా హాలిడేని నేనే ప్లాన్ చేసుకోగలను. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఆ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది, అంతే" అని చెప్పారు. జాకీ తన భార్యతో ఉన్న పారదర్శకత గురించి మాట్లాడుతూ.. "నాకు మాజీ ప్రియురాళ్ల నుంచి ఫోన్ వచ్చినా, రకుల్ పక్కనే ఉన్నప్పుడు నేను స్పీకర్ ఆన్ చేసే మాట్లాడతాను.
ఏమీ దాచడం లేదు కాబట్టి, నాకు ఎక్కడా ఊపిరి ఆడని పరిస్థితి ఉండదు. నిజాయితీగా ఉన్నప్పుడు బంధం చాలా తేలికగా ఉంటుంది" అని వెల్లడించారు. మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, ఫిబ్రవరి 2024లో గోవాలోని ITC గ్రాండ్ హోటల్‌లో సిక్కు (ఆనంద్ కారజ్) సింధీ పద్ధతుల్లో రెండు వేర్వేరు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. పెళ్లిలో పింక్-పీచ్ లెహంగాలో రకుల్ చాలా అందంగా కనిపించగా, వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేశాయి. పారదర్శకత, స్నేహం, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవంతో ఈ జంట తమ వైవాహిక జీవితాన్ని కొత్త తరహాలో ఎంజాయ్ చేస్తోంది.
Neha Sharma: నల్లని దుస్తుల్లో ఉబికి వస్తున్న అందాలతో రెచ్చగొడుతున్న ‘చిరుత’ బ్యూటీ






