ట్రెండ్ మారినా ప్రజల ప్రేమ శాశ్వతం.. శరత్ కుమార్ వైరల్ కామెంట్

by Mallepaka Hamsa |

స్టార్ హీరో శరత్ కుమార్(Sarath Kumar) చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రెండ్ మారినా ప్రజల ప్రేమ శాశ్వతం.. శరత్ కుమార్ వైరల్ కామెంట్
X

దిశ, సినిమా: స్టార్ హీరో శరత్ కుమార్(Sarath Kumar) చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, మన ఆలోచనా విధానం, జీవనశైలి, క్రమశిక్షణ ఉంటే ఎన్ని ఏళ్లైనా చురుకుగా ఉండవచ్చని ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ, ఫిట్‌నెస్‌పై ఫోకస్ ఉంటే కెరీర్ కూడా దీర్ఘకాలం కొనసాగుతుందనే సందేశాన్ని యువతకు అందించారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్స్‌పై శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేదని, కానీ ఇప్పుడు కథ బాగుంటే అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రేక్షకులు గుర్తింపు ఇస్తున్నారని అన్నారు.

ఇది సినిమాకు పనిచేసే ప్రతి టెక్నీషియన్‌, ఆర్టిస్ట్‌కు గౌరవం పెరిగేలా చేస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన కెరీర్‌ను ఉదాహరణగా చూపిస్తూ, హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడం తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు. సహాయ పాత్రల్లోనూ బలమైన పాత్రలు దొరికితే అవి కూడా హీరో పాత్రలతో సమానంగా ప్రేక్షకుల హృదయాలను తాకగలవని చెప్పారు. నటనలో పాత్ర ప్రాముఖ్యతే అసలు కీలకమని మరోసారి గుర్తు చేశారు.

మొత్తంగా శరత్ కుమార్ వ్యాఖ్యలు నటన, ఆరోగ్యం, జీవనశైలి, ఇండస్ట్రీ మార్పులపై ఓ సానుకూల దృక్పథాన్ని చూపిస్తున్నాయి. ట్రెండ్లు మారినా, కథపై ప్రేమ ఉన్న ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ శాశ్వతం అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా.. శరత్ కుమార్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘3BHK’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ‘కుంబసీవి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Next Story