Smriti Irani: కోటి రూపాయలు ఇచ్చినా.. ఆ పని మాత్రం చేయను..

by Disha Web Desk 10 |
Smriti Irani: కోటి రూపాయలు ఇచ్చినా.. ఆ పని మాత్రం చేయను..
X

దిశ, సినిమా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు సినిమా ఇండస్ట్రీ ద్వారా భారీ గుర్తింపు పొందింది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్మృతి ఇరానీ నటిగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుందో చెప్పుకొచ్చింది. ‘ఒక నటిగా కెరీర్ ప్రారంభించిన రోజుల్లో నా దగ్గర డబ్బులు లేవు. నాకు పెళ్లైన కొత్తలో రూ.25 లక్షలు లోన్ తీసుకుని ఇల్లు కొనుకున్నాం. కానీ దానికి EMI కట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి టైంలో ఓ ఆఫర్ వచ్చింది. కోట్లలో డబ్బులు ఇస్తాం అన్నారు. కానీ ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎందుకు ఈ ఆఫర్ వదులుకుంటున్నావు? నీకు పిచ్చా? అని అందరు తిట్టారు. కానీ అది పాన్ మసాలా యాడ్. నా అభిమానులు నన్ను ఫ్యామిలీ మనిషిలా భావిస్తారు. అలాంటప్పుడు ఇలాంటి యాడ్‌లు చేయడం కరెక్ట్ కాదు. ఈ యాడ్ చిన్న పిల్లలు కూడా చూస్తారు. అందుకే ఇలాంటి చెడు వ్యసనాలకు సంబంధించిన ప్రకటనలు చేయను’ అంటూ చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed