- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వచ్చినా ఆ పాత్రలు చేయను.. స్టార్ నటి షాకింగ్ నిర్ణయం
ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఆమె, ఆయనతో కనీసం ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడే ఆమె ఒక కండిషన్ పెట్టారు.

దిశ, సినిమా: తెలుగు తెరపై ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి. స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో సీరియల్స్, క్యారెక్టర్ రోల్స్‌తో బిజీగా ఉన్నారు. ఈక్రమంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఆమె, ఆయనతో కనీసం ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడే ఆమె ఒక కండిషన్ పెట్టారు. "ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చినా.. ఆయనకు తల్లి పాత్రలో మాత్రం అస్సలు నటించను. అలాగే అక్క, వదిన వంటి పాత్రలు ఇచ్చినా చేయను. ఎలాగూ హీరోయిన్ ఛాన్స్ రాదు కాబట్టి, కనీసం మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితేనే చేస్తాను" అని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ ట్రైలర్ చూసినప్పుడే ఆయన ఒక పెద్ద స్టార్ అవుతారని తన తమ్ముడితో చెప్పానని రాశి గుర్తు చేసుకున్నారు.
తాను థియేటర్‌కు వెళ్లేది కేవలం ప్రభాస్ సినిమాల కోసమేనని, ముఖ్యంగా ఛత్రపతి, బాహుబలి 1 & 2 చిత్రాలను వెండితెరపై చూసి ఎంజాయ్ చేశానని చెప్పారు. ప్రభాస్ నటించిన మిర్చి, రాధేశ్యామ్ వంటి మూవీల్లో కొన్ని పాత్రలకు తాను డబ్బింగ్ కూడా చెప్పానని రాశి వివరించారు. ప్రభాస్‌ను ఇప్పటి వరకు నేరుగా కలవలేదని రాశి ఆవేదన వ్యక్తం చేశారు. ‘అడవి రాముడు’ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ఉన్న హోటల్‌లోనే తాను కూడా ఉన్నానని, అది తెలిసి ఎగిరి గంతేశానని చెప్పారు. అయితే ఆయన్ని నేరుగా కలవడానికి మొహమాటపడి, ఆయన రూమ్ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడానని తెలిపారు. ప్రభాస్ సెట్స్‌లో అందరికీ ఇచ్చే మర్యాద గురించి తాను చాలా విన్నానని, ఆయన వ్యక్తిత్వం అంటే తనకు ఎంతో గౌరవమని రాశి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆమె కండీషన్లు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.






