నాకు అర్హత లేకపోయినా ‘ఆదిపురుష్’‌లో లక్ష్మణుడిగా నటించా.. నటుడి కామెంట్స్ వైరల్

by Disha Web Desk 6 |
నాకు అర్హత లేకపోయినా ‘ఆదిపురుష్’‌లో లక్ష్మణుడిగా నటించా.. నటుడి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో ప్రభాస్, కృతి సనన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘ఆదిపురుష్’. ఇందులో స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించగా.. రాముడి తమ్ముడు, లక్షణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటించాడు. అయితే ఇటీవల సన్నీ సింగ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ నేను వేరే షూటింగ్‌లో ఉన్నప్పుడు ఓం రౌత్ కాల్ చేశారు. నేను వెళ్లి కలిశాను. ఇది ఏ సినిమా డిస్కషన్ అని అడిగాను. అప్పుడు ఆయన నాకు రామాయణం అని చెప్పకుండా ఇదొక పెద్ద సినిమా అని చెప్పారు. నువ్వు లక్ష్మణుడి పాత్రలో నటించాల్సిందే అని పట్టుబట్టారు. అది వినగానే ఆహా ఎంత అదృష్టవంతుడిని అనుకున్నాను. కానీ, లక్ష్మణుడిగా నటించే అర్హత నాకు లేదు. అయినా సరే ఒప్పేసుకున్నాను. మూవీ షూటింగ్ అయిపోయాక పోస్టర్లు రిలీజ్ అయ్యాక నాకు ఎంతో గౌరవం దక్కింది. నేను వేరే షూట్‌లో ఉన్నప్పుడు ఓ ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చి నన్ను కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యారు. వారికి నేను నిజంగానే లక్ష్మణుడిలా కనిపించానట. అది చూసి ఎంతో ఆనందమేసింది. ఇక సినిమా రిలీజ్ అవుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రభాస్ రాముడిగా సరిపోయారు. ఆయన తమ్ముడిగా లక్ష్మణుడిగా ఉన్న నన్ను ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read More: సుదర్శన్ థియేటర్ ముందు నిద్రపోయిన ఫ్యాన్ (వీడియో)

‘ఓం రౌత్ నిన్ను చంపేస్తా’.. ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌పై ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)



Next Story

Most Viewed