ఆ దేవుడు కూడా మా ఇద్దరినీ విడదీయలేడు.. దయచేసి విడాకుల వార్తలు నమ్మొద్దంటూ నటుడి భార్య షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

స్టార్ నటుడు గోవింద(Govinda) భార్య సునీతా అహూజా(Sunita Ahuja) విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఆ దేవుడు కూడా మా ఇద్దరినీ విడదీయలేడు.. దయచేసి విడాకుల వార్తలు నమ్మొద్దంటూ నటుడి భార్య షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ నటుడు గోవింద(Govinda) భార్య సునీతా అహూజా(Sunita Ahuja) విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కొడుకు, కూతురు ఉండగా.. వీరిద్దరు విడివిడిగా జీవనం కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా గోవింద ఓ మరాఠీ కుర్ర హీరోయిన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సునీతా విడాకులు కోరుతూ కోర్టుకు ఎక్కింది. గత ఏడాది డిసెంబర్ 5న బంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు పమాచారం. హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వ్యభిచారం, క్రూరత్వం కింత డివోర్స్ కావాలని కోరింది. అయితే వీరి కేసు కోర్టులో నడుస్తుండగా.. ప్రముఖ న్యాయవాది లలిత్ బిందాల్ ఇరువురిని ఒప్పించి మళ్లీ కలిపాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, గోవిందా భార్య సునీతా విడాకుల వార్తలపై క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘‘ఏదైనా జరిగి ఉంటే మేము దగ్గరగా ఉండేవాళ్లం కాదు. మా మధ్య మరింత దూరం పెరిగేది. పై నుంచి దేవుడు దిగి వచ్చినా మా ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు. నా గోవిందా నా వాడు మాత్రమే. మరెవరికీ ఆయన హృదయంలో స్థానం లేదు. కాదు.. మేము నోరు తెరిచి చెప్పే వరకు దయచేసి మా గురించి వచ్చే వార్తలు నమ్మొద్దు. మేము విడాకులు తీసుకోవడం లేదు.. ఆ పుకార్లు నమ్మకండి.. గోవింద నేను చాలా సంతోషంగా ఉన్నాము’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అది చూసిన నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. అంత చేసిన సునీతా ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని షాక్ అవుతున్నారు.

link

Next Story