విడుదలకు సిద్ధమైన ‘ఎర్ర చీర’.. ఆడియన్స్‌కు కీలక విజ్ఞప్తి చేసిన డైరెక్టర్

by Mallepaka Hamsa |

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’(arracheera).

విడుదలకు సిద్ధమైన ‘ఎర్ర చీర’.. ఆడియన్స్‌కు కీలక విజ్ఞప్తి చేసిన డైరెక్టర్
X

దిశ, సినిమా: బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’(arracheera). ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని(Sai Tejaswini) కనిపించనుంది. ‘ఎర్రచీర’ మూవీకి సుమన్ బాబు(Suman Babu) స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా చూసిన సెన్సార్ వారు A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీ ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు చూడటానికి అనుమతి లేదు. అలాగే హార్ట్ పేషెంట్స్ ఈ సినిమానికి చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా చిత్ర దర్శకుడు సుమన్ బాబు తెలిపారు.

తాజాగా, మూవీ మేకర్స్ విడుదల తేదీ ప్రకటించారు. ఈ సందర్భంగా.. నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘‘సినిమా కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న ‘ఎర్రచీర’ను ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. క్లైమాక్స్ హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. అలాగే సుమన్ బాబు మాట్లాడుతూ ‘‘కొన్ని సినిమాల్లోని సోల్ మనం అనుభూతి చెందాలంటే, ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలి. మా ‘ఎర్ర చీర’ మూవీ కూడా అలాంటిదే. సౌండింగ్, విజువలైజేషన్ అనుభూతి మీకు తెలియాలంటే ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలని అన్నారు.

Next Story