ఆ ముగ్గురు సినిమాను నాశనం చేశారు: 'బ్రహ్మాస్త్ర'పై Actress Erica Fernandes

by Chukka Sudharani |   (  Updated:2022-09-15 14:26:22  IST  )

Actress Erica Fernandes Is Not Impressed With Ranbir Kapoor, Alia Bhatt's Brahmastra

ఆ ముగ్గురు సినిమాను నాశనం చేశారు: బ్రహ్మాస్త్రపై Actress Erica Fernandes
X

దిశ, సినిమా : బాలీవుడ్ మూవీ 'బ్రహ్మాస్త్ర'పై ఎరికా ఫెర్నాండెజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలియా భట్, రణ్‌బీర్‌లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారన్న ఆమె.. దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ప్రేక్షకులను డిజాప్పాయింట్ చేశాడని అప్‌సెట్ అయింది. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఆస్క్ మీ ఎనిథింగ్ సెషన్‌లో 'మీరు ఈ చిత్రం చూశారా?' అనే అభిమానుల ప్రశ్నలకు జవాబులిచ్చిన నటి.. 'అవును నేను చేసాను. ఇది ఒక గొప్ప ప్రయత్నమే. కానీ, విజయవంతం కాలేదు. వీఎఫ్‌ఎక్స్‌లు యూజ్ చేసిన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది కేవలం రొమాన్స్ మాత్రమే ఉన్న కథ కాదని దర్శకుడు గ్రహించాలి. ఇది స్పష్టంగా నా అభిప్రాయం మాత్రమే. ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛా హక్కు ఉంది' అంటూ ముగించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

బ్రహ్మాస్త్ర కలెక్షన్లపై కంగనా సంచలన కామెంట్స్

Next Story