తెలుగులో విడుదల కాబోతున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా.. ఆ బ్యానర్‌కే థియేట్రికల్ రైట్స్

by Mallepaka Hamsa |

స్ఎస్ దుష్యంత్(Dushyanth), ఆషిక రంగనాథ్(Ashika Ranganath) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా ‘గత వైభవ’(Gatha Vaibhava).

తెలుగులో విడుదల కాబోతున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా.. ఆ బ్యానర్‌కే థియేట్రికల్ రైట్స్
X

దిశ, సినిమా: ఎస్ఎస్ దుష్యంత్(Dushyanth), ఆషిక రంగనాథ్(Ashika Ranganath) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా ‘గత వైభవ’(Gatha Vaibhava). సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (Primeshow Entertainment)కే. నిరంజన్ రెడ్డి(Niranjan Reddy), చైతన్య రెడ్డి ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. తమ సక్సెస్ ఫుల్ ట్రాక్‌ రికార్డ్‌, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌తో ఈ మూవీని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఉత్తర అమెరికా, కెనడాలలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రైమ్‌షో క్రెడిబిలిటీతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, విదేశీ మార్కెట్లలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా జరుగుతున్నాయి. రిలీజ్‌ డేట్‌ సమీపిస్తుండటంతో ప్రమోషన్లు మరింత దూకుడుగా సాగనున్నాయి. లవ్, మైథాలజీ, పునర్జన్మ, పీరియడ్‌ డ్రామా, నాలుగు యుగాల నేపథ్యంలో సాగే ఈ కథ, అద్భుతమైన VFX తో ప్రేక్షకులకు విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.

Next Story