మరికొన్ని గంటల్లో ఎంగేజ్‌మెంట్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అల్లు శిరీష్.. అయ్యో పాపం అంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |

‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయాడు.

మరికొన్ని గంటల్లో ఎంగేజ్‌మెంట్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అల్లు శిరీష్.. అయ్యో పాపం అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయాడు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికీ అనుకున్నంత ఫాలోయింగ్‌ను సంపాదించుకోలేకపోయాడు అల్లు శిరీష్(Allu Sirish). దీంతో పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే అల్లు శిరీష్ బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్న విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా నైనిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ఆయన అక్టోబర్ 31న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. కానీ కాబోయే భార్య ముఖాన్ని మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో అభిమానులంతా అల్లు వారింటికి కాబోయే చిన్న కోడలిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అల్లు శిరీష్ ఎప్పుడెప్పుడు నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, అల్లు శిరీష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మరికొన్ని గంటల్లో ఎంగూజ్మెంట్ జరగనుండగా.. అల్లు శిరీష్ ‘‘చలికాలంలో అవుట్‌డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశాను. కానీ వాతావరణం సహకరించడం లేదు. దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్’’ అని రాసుకొచ్చారు. అలాగే ఎంగేజ్‌మెంట్ కోసం డెకరేషన్ వర్క్స్ జరుగుతున్న ఫొటో షేర్ చేశారు.

దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా అయ్యో పాపం అని కామెంట్లు పెడుతున్నారు. అవుట్‌డోర్, వెన్నెల వెలుతురులో గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ఎంగేజ్‌మెంట్ కాస్త.. మొంథా తుఫాను వల్ల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షం తగ్గిపోయి వాతావరణం సహకరిస్తే ఔట్‌డోర్‌లోనే ఎంగేజ్మెంట్ వేడుక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ వర్షాలు ఆగకపోతే సింపుల్‌గా ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరగనుందని సమాచారం.

Next Story