- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వాన్ని సాయం కోరుతూ చిన్నారి ఎమోషనల్ వీడియో.. గొప్ప మనసు చాటుకున్న హీరో.. ఆసక్తికర ట్వీట్ వైరల్
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Raghava Lawrence)కు పరిచయం అక్కర్లేదు. ఆ

దిశ, సినిమా: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Raghava Lawrence)కు పరిచయం అక్కర్లేదు. ఆయన పలువురు స్టార్ హీరోలకు డ్యాన్స్ స్టెప్పులు నేర్పించడంతో పాటు నటనపై ఆసక్తితో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించారు. అలా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఆయన ‘కాంచన’ (Kanchana)హారర్ సినిమాతో హీరోగా మారాడు. ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్తులు పెడుతున్నారు. అంతేకాకుండా ఓ లారెన్స్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా సాయం కోరిన వారికి తనవంతు సహాయం అందిస్తూ అందరిచేత ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా, రాఘవ లారెన్స్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఏముందంటే.. ఓ ముగ్గురు చిన్నారుల తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని మందులు కొనడానికి కూడా డబ్బులు లేవని దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పుకొచ్చారు.
ఇక సాయం కోరిన చిన్నారులకు రాఘవ లారెన్స్ తనవంతు సాయం చేస్తానని తన టీమ్ సంప్రదిస్తుందని చెప్పారు. ఈ మేరకు ‘‘ఈ వీడియో నా వరకు చేరవేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రభుత్వాన్ని సాయం కోరినందుకు తర్వాత వారు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటారు. మీకు సహాయం చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను. నా బృందం ఈరోజే మిమ్మల్ని చేరుకుంటుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రాఘవ లారెన్స్ గొప్ప మనసు తెలుసుకుని చాలా గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.






