అతడే నా ఫస్ట్ క్రష్.. తెలియకుండానే ప్రేమలో పడిపోయా

by Disha Web Desk 9 |
అతడే నా ఫస్ట్ క్రష్.. తెలియకుండానే ప్రేమలో పడిపోయా
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఎమ్మా వాట్సన్ తన ఫస్ట్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకు తోటి అమ్మాయిల వలే సాధారణంగా ఉండటం తెలియదని, తెలివి తక్కువ అమ్మాయిగా కొంతకాలం ఒత్తిడికి లోనైననట్లు తెలిపింది. అలాగే తన మొదటి చిత్రం రిలీజ్ అయిన తర్వాత కూడా ఎవరేం మాట్లాడుతున్నారో, ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదని ఎమోషనల్ అయింది. ఇక షాపింగ్‌, పలు ఈవెంట్స్‌కు వెళ్తున్న క్రమంలో తన ఫ్రెండ్స్ ‘బ్రాడ్ పిట్’ చిత్రాలను పరిచయం చేశారన్న మ్మా.. ‘అప్పటిదాకా ఆయనొక పెద్ద స్టార్ నటుడనే విషయం తెలియదు. బ్రాడ్ పిట్ నటించిన ఒక్క సినిమా కూడా నేను చూడలేదు. కానీ, తన యాక్షన్ స్టంట్స్ చూశాక తనపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. అతనితో పరిచయం ఏర్పడక ముందే ప్రేమలో పడిపోయా’ అంటూ పలు విషయాలు వెల్లడించింది.

Also Read: పేరెంట్స్ విడాకులపై అలయ షాకింగ్ కామెంట్స్.. అవగాహన లేదంటూ


Next Story

Most Viewed