ఆ వయసులోనే అతన్ని ప్రేమించా.. బోల్డ్ బ్యూటీ ఓపెన్

by samatah |   (  Updated:2023-04-06 14:12:10  IST  )

హాలీవుడ్ నటుడు, నిర్మాత గెరార్డ్ బట్లర్‌తో కలిసి పనిచేయడం గురించి నటి ఎల్నాజ్ నొరౌజీ ఇట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం గెరార్డ్ సరసన ‘కాందహార్’ అనే సినిమాలో నటించగా

ఆ వయసులోనే అతన్ని ప్రేమించా.. బోల్డ్ బ్యూటీ ఓపెన్
X

దిశ, సినిమా : హాలీవుడ్ నటుడు, నిర్మాత గెరార్డ్ బట్లర్‌తో కలిసి పనిచేయడం గురించి నటి ఎల్నాజ్ నొరౌజీ ఇట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం గెరార్డ్ సరసన ‘కాందహార్’ అనే సినిమాలో నటించగా ఈ మూవీ మే 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గెరార్డ్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. అతను చాలా సరదాగా ఉంటాడు. సెట్‌లో అతని బిహేవియర్, యాటిట్యూడ్ చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి ఆయన చిత్రాలను మిస్ అవకుండా చూసేదాన్ని. నిజం చెప్పాలంటే యుక్తవయస్సులో ఉన్నప్పుడు అతనిపై క్రష్ ఉండేది’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

Read More: వైట్ కలర్ బికినీతో వాటర్‌లో తేలిన టాలీవుడ్ నటి

Next Story