- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ దర్శకుడితో ఈషా రెబ్బా డేటింగ్.. పెళ్లి ఎప్పుడంటే?
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోతున్నారు.

దిశ, సినిమా: ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటూ పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోతున్నారు. ఊహించని విధంగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కొందరైతే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తే.. మరికొందరు మాత్రం సీక్రెట్‌గా రిలేషన్‌షిప్ కొనసాగిస్తూ వివాహం కూడా చేసుకుంటున్నారు. వారిపై రకరకాల గాసిప్స్ వచ్చినప్పటికీ స్పందించడం లేదు. ఇటీవల సమంత కూడా అలాగే చేసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడాదిపాటు డేటింగ్‌లో ఉండి.. డిసెంబర్ 1న సడెన్‌గా పెళ్లి చేసుకుని అధికారిక ప్రకటనతో షాకిచ్చింది. ఇక ఇప్పుడు ఇదే కోవలో మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆమె మరెవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba).. పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్(Tarun Bhaskar)తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వీరిద్దరు పేరు మార్మోగిపోతుంది. ఈ క్రమంలో తరుణ్ - ఈషా రెబ్బాలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలు డేట్స్ వైరల్ అయ్యాయి. ఈక్రమంలో.. తాజాగా, దీనికి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తరుణ్ భాస్కర్- ఈషా వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు టాక్. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొని సమంతలాగా అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.






