ఇక్కడ తప్ప.. మరెక్కడ అలాంటి అనుభూతి పొందలేరు: రాధిక

by Disha Web Desk 7 |
ఇక్కడ తప్ప.. మరెక్కడ అలాంటి అనుభూతి పొందలేరు: రాధిక
X

దిశ, సినిమా: టీవీలో నేర్చుకునే విద్యలు మరెక్కడా నేర్చుకోలేరని రాధికా మదన్ చెప్తోంది. ‘మేరీ ఆషికి తుమ్ సే హి’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ఆమె.. బుల్లితెర నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన అనుభవాలను షేర్ చేసుకుంది. టెలివిజన్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానన్న బ్యూటీ.. ‘మీరు టీవీలో ఏదైతే నేర్చుకున్నారో.. దాన్ని మరెక్కడ నేర్చుకోలేరు. ఆ అనుభూతి పొందలేరు’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. అలాగే తాను సినిమాల్లోకి మారడానికి ముందు తన సహనటులు టెలివిజన్‌ను వదిలి వెళ్లొద్దని, మరో 2-3 సంవత్సరాలు అక్కడే పనిచేయాలని కోరినట్లు చెప్పుకొచ్చింది. చివరగా తాను ఏ స్థాయిలో ఉన్నా మూలాలను మాత్రం మరిచిపోనని చెప్పింది.

Also Read..

పెళ్లి కాకముందే అలా చేయడం తప్పు కాదంటున్న శృతిహాసన్

నేను బై-సెక్సువల్.. అన్ని అందాలను ఆస్వాదిస్తా: మిస్ యూనివర్స్

ఈ రోజుల్లో వాటికి సరిహద్దులు లేవు.. అందరితో అల్లుకుపోవాలి


Next Story

Most Viewed